Thursday, October 31, 2024

AYYAPPA SONGS FULL ALBUMS#yesudas#linkindescription

AYYAPPA SONGS FULL ALBUMS#yesudas 

hindudevotional 1

GHANTASALA_SONGS#mp3 #videos #albums#linkindescription

GHANTASALA_SONGS#mp3 #videos #albums FREE DOWNLOAD LINKS: https://drive.google.com/drive/folders/1bSVlPhg-YqCUSLUS85yj97KZsnaYQFE5 https://www.youtube.com/playlist?list=PL_d1kzIcP-moiGl8E-seq8eYkNPvmKIZn

NAMASTHE TELANGANA&TELANGANA TODAY& TELANGANM 31 OCT 2024

రామ రామ రామ్ రామ్ రామ్ జయ రామ రామ

అమ్మ ఒక వైపు దేవతలంతా ఒక వైపు DR C NARAYANA REDDY MELODY SONG

Karpoora vasantha Raayalu -Dr C Narayana Reddy కర్పూర వసంత రాయలు -డాక్టర్ సి నారాయణ రెడ్డి

60 మంది పోలీసుల ముందు CI అవమానించాడని కానిస్టేబుల్ చేసాడో తెలుసా | Civil ranker Uday krishna Story # IPS Uday Krishna Reddy Inspirational Interview‪

Wednesday, October 30, 2024

దైవ నిర్మితమైన ఈ సృష్టిలోని ప్రతి అంశాన్నీ ప్రేమించడం మన మొదటి లక్ష్యం, చివరి లక్ష్యం.

 

 దైవ నిర్మితమైన ఈ సృష్టిలోని ప్రతి అంశాన్నీ ప్రేమించడం  మన మొదటి లక్ష్యం, చివరి లక్ష్యం.

*గమ్యం - గమనం **జీవిత లక్ష్యం ఏమిటి? ఏ లక్ష్యమూ చేరుకోవాలనే కోరిక లేని స్థితిని చేరుకోవడమే జీవిత లక్ష్యం. ఏ గమ్యమూ అవసరం లేని సంపూర్ణ సంతృప్తి,
పరిపూర్ణ సుఖ ప్రవృత్తి - ఇదే లక్ష్యం. ఈ మాటలు సరిగ్గా అర్థం అయితే
'జీవించి' ఉండడమే జీవన లక్ష్యమని తెలుసుకుంటారు. 'ఉల్లాసకరంగా', 'ఉత్తేజభరితంగా' జీవిస్తూ జీవన ఫలం లోని మాధుర్య రసాన్ని జుర్రుకోవడమే నీ లక్ష్యం.
నీ గమ్యమేమిటని నదిని అడుగు. సముద్రంలో చేరడమంటుంది. సముద్రాన్ని అడుగు, జవాబు దొరకదు. చిన్న నదికి గమ్యం ఉంది. పెద్ద కడలికి పెద్ద గమ్యం ఉండాలి కదా! అసలేమి లేదు. *

*నీవు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా జీవిస్తుంటే అది చాలు. నీ జీవిత లక్ష్యం నెరవేరి పోయింది. అసలైన లక్ష్యాలన్నీ ఎప్పుడో ముందుగానే సాధింపబడినాయి. ఇప్పుడు నువ్వు సాధించ దలచుకున్నవి ఎంత చిన్నవైనా, ఎంత పెద్దవైనా సరే, కేవలం ఆభరణాలు మాత్రమె. అలంకార ప్రాయమే. ఇక్కడ రెండు విభిన్న విషయాలున్నాయి. ఒకటి లబ్ది దారుడు. రెండు లభ్య వస్తువు. మంచి ఉద్యోగం, పెద్ద జీతం, ఇల్లు, హోదా - ఈ లక్ష్యాలు సామాజిక భూషణాలు. మంచి భార్య, చక్కటి పిల్లలు - ఇవి భౌతిక ఆభరణాలు. లభ్య వస్తువు కంటే లబ్ది దారుడే గొప్పవాడు. ముత్యాలహారం కంటే దానిని ధరించిన కంఠం గొప్పది. వజ్రపు ముక్కెర కంటే సంపంగి ముక్కు విలువైనది. 'అమ్మాయి' నామ వాచకం. ఆమె ధరించిన 'నగ' విశేషణం. హారం పోయినా పర్వాలేదు, కంఠం ఉంది. అదే పదివేలు, కాదు పది కోట్లు. ముక్కెర లేకపోయినా నష్టం లేదు. ముక్కు ఉంది. అదే మహాభాగ్యం.నీ తలపై ధరించే తలపాగా లేదా నవరత్న ఖచిత కిరీటం కంటే, నీ తల చాలా విలువైనది. అలాగని మకుటం లోని మణులను తేలిక చెయ్యడం కాదు. కిరీటపు వన్నె చిన్నెలను తక్కువగా చెప్పడం కూడా కాదు. నీకు కిరీటం కావాలని తీవ్రమైన కోరిక ఉంటే కష్టించు. అన్వేషించు, శతవిధాల ప్రయత్నించు. సాధించు. తప్పులేదు. కానీ, దానికోసం లేనిపోని
తలనొప్పి తెచ్చుకోకు. తల బొప్పి కట్టించుకోకు. తల తాకట్టు పెట్టకు. శిరోభూషణం కంటే శిరస్సు అమూల్యమైనదని గ్రహించిన తర్వాత, కిరీటం కోసం ప్రయత్నించు. అపుడు నీ ప్రయత్నం ప్రమోదభరితం గా ఉంటుంది. ఒక మంచి వక్తను చూడండి. చక్కటి కృషితో భాషా విజ్ఞానం సంపాదించాడు. వాక్పటిమను పెంచుకున్నాడు. ఏ విషయం గురించైనా అనర్గళంగా, అలవోకగా మాట్లాడే సామర్థ్యం తెచ్చుకున్నాడు. అతని చతుర సంభాషణా శైలిని అందరూ పొగుడుతున్నారు. అది అతనికి ప్రత్యెక అలంకారం. ఇక మన విషయం చూద్దాం. మనకు మాట్లాడే శక్తి ఉంది. దైనందిన వ్యవహారాల్లో ఇతరులతో మాట్లాడగలం. ఇది మనందరికీ గర్వకారణం. చాకచక్యంగా
సంభాషించలేక పోవచ్చు. ప్రయత్నిస్తే సాధ్యపడుతుంది. ఒక్కమాటైనా పలుకలేని మూగవారి గురించి ఆలోచించండి! వారికంటే మనమెంత అదృష్టవంతులం! ఒకసారి సరదాగా మిత్రులతో అన్నాను, నేను విశేషణాలు, ఆభరణాలు లేని నగ్నమైన నామవాచకాన్ని అని. 'నేను నేనుగా' ఉన్నాను. 'నీవు నీవుగా' ఉన్నావని గర్వపడాలి. నీకున్నవి ఏవైనా సరే, నీకంటే గొప్పవి కావు. ఎంతో ఖరీదైన బూట్లు నీ పాదాల కంటే చాలా అల్పమైనవి. అద్భుతమైన జీర్ణశక్తిని ప్రకృతి మనకు వరంగా ఇచ్చింది. ఎప్పుడైనా అజీర్ణ వ్యాధి బారిన పడితే అప్పుడీ విషయం అనుభవంతో అర్థమవుతుంది. భోజనంచేయడం, జీర్ణం చేసుకుని శక్తిగా మార్చుకోవడం మామూలు విషయం కాదని అప్పటికి గానీ తెలిసి రాదు. ఆసుపత్రిలో ఒక్కసారి డయాలసిస్ చేయాలంటే, రెండు - మూడు వేలు ఖర్చు అవుతుంది. మన కిడ్నీలు రోజుకు నలభై ఎనిమిది సార్లు డయాలసిస్ చేస్తాయి. అంటే రోజుకు లక్ష రూపాయలను మనకు కిడ్నీలు సంపాదించి పెడుతున్నాయి. కిడ్నీలు బాగున్న ప్రతి వ్యక్తీ కోట్లకు పడగలెత్తినట్లే. మన ప్రతి అవయవమూ అమూల్యమైనది. ఈ శరీరం అనంతకోటి నిధులకు నిలయం. నువ్వు జన్మించిన క్షణంలోనే నీ లక్ష్యం నెరవేరింది. నీకిక వేరే గమ్యమేమీ లేదు. జీవించి ఉండడమే నీ పరమగమ్యం. ఇదే మహోన్నత లక్ష్యం. గొప్ప గొప్ప లక్షణాలుగా నువ్వు భావించేవన్నీ నీ ఉనికి కంటే చాలా చిన్నవి. కాబట్టి, అవి సాధించినా పెద్ద తేడా ఏమీ ఉండదు.
సాధించకపోయినా ఇబ్బంది లేదు. పువ్వును అడగండి, నీ ఆశయమేమిటని? వికసించి చూపిస్తుంది. పసిపాపను ప్రశ్నించండి, బోసినవ్వును సమాధానంగా ఇస్తుంది. పక్షి లక్ష్యం హాయిగా ఎగరడమే. నీ లక్ష్యం ఆరోగ్యంగా, ఆనందంగా బ్రతకడమే.
శరీరం నిరంతరం శ్రమించినా, మనసును శాంతంగా సుఖించనీ! కూడు, గూడు నిత్యావసరాలకు సరిపడినంత ధనం ఇవి నిజమైన లక్ష్యాలు. ఉత్సాహంగా, ఉత్తేజంగా జీవించడం అంతకంటే మహదాశయం. మనిషిగా జన్మించి మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా ఉంటే అతి గొప్ప గమ్యాన్ని చేరుకున్నట్లే, సాధించవలసిన లక్ష్యాన్ని సాధించినట్లే. ఆ తరువాత మనం చేరబోయే గమ్యాల గమనం, మనకు ఇదివరకే పరమాత్మ ప్రసాదించిన పరమ గమ్యాన్ని (జీవించి ఉండటం) చేరేలా ఉండాలి, దాని గాఢతను పెంచేలా ఉండాలి. మనం సాధించాలనుకున్న ఇతర లక్ష్యాలన్నీ, మనకు సృష్టికర్త మన తరఫున సాధించిన లక్ష్యం (ఆరోగ్యంగా జీవించడం) యొక్క కక్ష్యలో తిరుగుతూ, ఆ లక్ష్యానికి మరింత ఆనందాన్ని కటాక్షించాలి. అంతే కానీ, పరమాత్మ తన అనంత మేధస్సును ధారపోసి మనకు వరంగా ప్రసాదించిన జీవన ధనాన్ని మన దృష్టిలో పెద్దగా కనబడే చిన్న లక్ష్యాలను సాధించడానికి వృధాగా ధారపోయరాదు. దైవాన్ని ప్రేమించడం, దైవ నిర్మితమైన ఈ సృష్టిలోని ప్రతి అంశాన్నీ ప్రేమించడం, ప్రకృతితో తాదాత్మ్యం చెందడం మన మొదటి లక్ష్యం, చివరి లక్ష్యం. *
*ఆడడం నెమలి లక్ష్యం. పాడడం కోయిల లక్ష్యం ఆడుతూ పాడుతూ బ్రతకడం మనందరి లక్ష్యం *
ఓం నమో భగవతే వాసుదేవాయ *
*సర్వం శ్రీ ఆంజనేయ స్వామి పాదారవిందార్పణమస్తు*
*కె.బి. నారాయణ శర్మ - **నాకు తెలిసింది అల్పం తెలుసుకో వలసినది అనంతం.*

 

 

 

Raghuveer Reddy Mass Interview | 🚨YOU CAN'T MISS THIS | Journalist Kranthi | KRTV

Political Analyst V Prakash Shocking Comments On Congress GOVT | BRS VS Congress | Political Scoop

BRS MLA Palla Rajeshwar Reddy Exclusive Interview | KCR | CM Revanth Reddy | Signal TV Telugu

పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన బీఆర్ఎస్ నేతలు..| Srinivas Goud Warning to One Town Police| MicTv News

కులగణన ఆపండి! హైకోర్టు సంచలన ఆదేశాలు🔴LIVE | TS High Court On Govt BC Caste Census | CM Revanth | RTV

Big Shock To CM Revanth Reddy | 5 Congress MLA's Contacted KCR? | Signal TV Telugu

Tuesday, October 29, 2024

Monday, October 28, 2024

#Telugu Gazals#DR_C_NARAYANA_REDDY

TYAGADHANUDU KARANAJANMUDU_KCR_TNEWS

ANNAMACHARY KIRTANALU_G.BALAKRISHNA PRASAD

ANNAMACHARY KIRTANALU_G.BALAKRISHNA PRASAD_DISK-8
ANNAMACHARYA KIRTANALU_G.BALAKRISHNA PRASAD_DISK-4
ANNAMACHAYA KIRTANALU__G.BALAKRISHNAPRASAD-DISK-6
ANNAMACHAYA KIRTANALU__G.BALAKRISHNAPRASAD-DISK-7
ANNAMACHAYA KIRTANALU__G.BALAKRISHNAPRASAD-DISK-5
ANNAMACHAYA KIRTANALU__G.BALAKRISHNAPRASAD-DISK-3
ANNAMACHAYA KIRTANALU__G.BALAKRISHNAPRASAD-DISK-1
ANNAMACHAYA KIRTANALU__G.BALAKRISHNAPRASAD-DISK-2
ANNAMACHARY KIRTANALU_G.BALAKRISHNA PRASAD

దైవ నిర్మితమైన ఈ సృష్టిలోని ప్రతి అంశాన్నీ ప్రేమించడం మన మొదటి లక్ష్యం, చివరి లక్ష్యం.

      దైవ నిర్మితమైన ఈ సృష్టిలోని ప్రతి అంశాన్నీ ప్రేమించడం  మన మొదటి లక్ష్యం, చివరి లక్ష్యం.
    *గమ్యం - గమనం **జీవిత లక్ష్యం ఏమిటి? ఏ లక్ష్యమూ చేరుకోవాలనే కోరిక లేని
    స్థితిని చేరుకోవడమే జీవిత లక్ష్యం. ఏ గమ్యమూ అవసరం లేని సంపూర్ణ సంతృప్తి,
    పరిపూర్ణ సుఖ ప్రవృత్తి - ఇదే లక్ష్యం. ఈ మాటలు సరిగ్గా అర్థం అయితే
    'జీవించి' ఉండడమే జీవన లక్ష్యమని తెలుసుకుంటారు. 'ఉల్లాసకరంగా', 'ఉత్తేజ
    భరితంగా' జీవిస్తూ జీవన ఫలం లోని మాధుర్య రసాన్ని జుర్రుకోవడమే నీ లక్ష్యం.
    నీ గమ్యమేమిటని నదిని అడుగు. సముద్రంలో చేరడమంటుంది. సముద్రాన్ని అడుగు,
    జవాబు దొరకదు. చిన్న నదికి గమ్యం ఉంది. పెద్ద కడలికి పెద్ద గమ్యం ఉండాలి
    కదా! అసలేమి లేదు. *

      *నీవు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా జీవిస్తుంటే అది చాలు. నీ జీవిత
      లక్ష్యం నెరవేరి పోయింది. అసలైన లక్ష్యాలన్నీ ఎప్పుడో ముందుగానే
      సాధింపబడినాయి. ఇప్పుడు నువ్వు సాధించ దలచుకున్నవి ఎంత చిన్నవైనా, ఎంత
      పెద్దవైనా సరే, కేవలం ఆభరణాలు మాత్రమె. అలంకార ప్రాయమే. ఇక్కడ రెండు విభిన్న
      విషయాలున్నాయి. ఒకటి లబ్ది దారుడు. రెండు లభ్య వస్తువు. మంచి ఉద్యోగం,
      పెద్ద జీతం, ఇల్లు, హోదా - ఈ లక్ష్యాలు సామాజిక భూషణాలు. మంచి భార్య, చక్కటి
      పిల్లలు - ఇవి భౌతిక ఆభరణాలు. లభ్య వస్తువు కంటే లబ్ది దారుడే గొప్పవాడు.
      ముత్యాలహారం కంటే దానిని ధరించిన కంఠం గొప్పది. వజ్రపు ముక్కెర కంటే సంపంగి
      ముక్కు విలువైనది. 'అమ్మాయి' నామ వాచకం. ఆమె ధరించిన 'నగ' విశేషణం. హారం
      పోయినా పర్వాలేదు, కంఠం ఉంది. అదే పదివేలు, కాదు పది కోట్లు. ముక్కెర
      లేకపోయినా నష్టం లేదు. ముక్కు ఉంది. అదే మహాభాగ్యం.నీ తలపై ధరించే తలపాగా
      లేదా నవరత్న ఖచిత కిరీటం కంటే, నీ తల చాలా విలువైనది. అలాగని మకుటం లోని
      మణులను తేలిక చెయ్యడం కాదు. కిరీటపు వన్నె చిన్నెలను తక్కువగా చెప్పడం కూడా
      కాదు. నీకు కిరీటం కావాలని తీవ్రమైన కోరిక ఉంటే కష్టించు. అన్వేషించు,
      శతవిధాల ప్రయత్నించు. సాధించు. తప్పులేదు. కానీ, దానికోసం లేనిపోని
      తలనొప్పి తెచ్చుకోకు. తల బొప్పి కట్టించుకోకు. తల తాకట్టు పెట్టకు. శిరో
      భూషణం కంటే శిరస్సు అమూల్యమైనదని గ్రహించిన తర్వాత, కిరీటం కోసం
      ప్రయత్నించు. అపుడు నీ ప్రయత్నం ప్రమోదభరితం గా ఉంటుంది. ఒక మంచి వక్తను
      చూడండి. చక్కటి కృషితో భాషా విజ్ఞానం సంపాదించాడు. వాక్పటిమను
      పెంచుకున్నాడు. ఏ విషయం గురించైనా అనర్గళంగా, అలవోకగా మాట్లాడే సామర్థ్యం
      తెచ్చుకున్నాడు. అతని చతుర సంభాషణా శైలిని అందరూ పొగుడుతున్నారు. అది అతనికి
      ప్రత్యెక అలంకారం. ఇక మన విషయం చూద్దాం. మనకు మాట్లాడే శక్తి ఉంది. దైనందిన
      వ్యవహారాల్లో ఇతరులతో మాట్లాడగలం. ఇది మనందరికీ గర్వకారణం. చాకచక్యంగా
      సంభాషించలేక పోవచ్చు. ప్రయత్నిస్తే సాధ్యపడుతుంది. ఒక్కమాటైనా పలుకలేని
      మూగవారి గురించి ఆలోచించండి! వారికంటే మనమెంత అదృష్టవంతులం! ఒకసారి సరదాగా
      మిత్రులతో అన్నాను, నేను విశేషణాలు, ఆభరణాలు లేని నగ్నమైన నామవాచకాన్ని అని.
      'నేను నేనుగా' ఉన్నాను. 'నీవు నీవుగా' ఉన్నావని గర్వపడాలి. నీకున్నవి ఏవైనా
      సరే, నీకంటే గొప్పవి కావు. ఎంతో ఖరీదైన బూట్లు నీ పాదాల కంటే చాలా
      అల్పమైనవి. అద్భుతమైన జీర్ణశక్తిని ప్రకృతి మనకు వరంగా ఇచ్చింది. ఎప్పుడైనా
      అజీర్ణ వ్యాధి బారిన పడితే అప్పుడీ విషయం అనుభవంతో అర్థమవుతుంది. భోజనం
      చేయడం, జీర్ణం చేసుకుని శక్తిగా మార్చుకోవడం మామూలు విషయం కాదని అప్పటికి గానీ
      తెలిసి రాదు. ఆసుపత్రిలో ఒక్కసారి డయాలసిస్ చేయాలంటే, రెండు - మూడు వేలు
      ఖర్చు అవుతుంది. మన కిడ్నీలు రోజుకు నలభై ఎనిమిది సార్లు డయాలసిస్ చేస్తాయి.
      అంటే రోజుకు లక్ష రూపాయలను మనకు కిడ్నీలు సంపాదించి పెడుతున్నాయి. కిడ్నీలు
      బాగున్న ప్రతి వ్యక్తీ కోట్లకు పడగలెత్తినట్లే. మన ప్రతి అవయవమూ
      అమూల్యమైనది. ఈ శరీరం అనంతకోటి నిధులకు నిలయం. నువ్వు జన్మించిన క్షణంలోనే
      నీ లక్ష్యం నెరవేరింది. నీకిక వేరే గమ్యమేమీ లేదు. జీవించి ఉండడమే నీ పరమ
      గమ్యం. ఇదే మహోన్నత లక్ష్యం. గొప్ప గొప్ప లక్షణాలుగా నువ్వు భావించేవన్నీ నీ
      ఉనికి కంటే చాలా చిన్నవి. కాబట్టి, అవి సాధించినా పెద్ద తేడా ఏమీ ఉండదు.
      సాధించకపోయినా ఇబ్బంది లేదు. పువ్వును అడగండి, నీ ఆశయమేమిటని? వికసించి
      చూపిస్తుంది. పసిపాపను ప్రశ్నించండి, బోసినవ్వును సమాధానంగా ఇస్తుంది.
      పక్షి లక్ష్యం హాయిగా ఎగరడమే. నీ లక్ష్యం ఆరోగ్యంగా, ఆనందంగా బ్రతకడమే.
      శరీరం నిరంతరం శ్రమించినా, మనసును శాంతంగా సుఖించనీ! కూడు, గూడు నిత్యావసరాలకు
      సరిపడినంత ధనం ఇవి నిజమైన లక్ష్యాలు. ఉత్సాహంగా, ఉత్తేజంగా జీవించడం అంతకంటే
      మహదాశయం. మనిషిగా జన్మించి మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా ఉంటే అతి గొప్ప
      గమ్యాన్ని చేరుకున్నట్లే, సాధించవలసిన లక్ష్యాన్ని సాధించినట్లే. ఆ తరువాత
      మనం చేరబోయే గమ్యాల గమనం, మనకు ఇదివరకే పరమాత్మ ప్రసాదించిన పరమ గమ్యాన్ని
      (జీవించి ఉండటం) చేరేలా ఉండాలి, దాని గాఢతను పెంచేలా ఉండాలి. మనం
      సాధించాలనుకున్న ఇతర లక్ష్యాలన్నీ, మనకు సృష్టికర్త మన తరఫున సాధించిన లక్ష్యం
      (ఆరోగ్యంగా జీవించడం) యొక్క కక్ష్యలో తిరుగుతూ, ఆ లక్ష్యానికి మరింత ఆనందాన్ని
      కటాక్షించాలి. అంతే కానీ, పరమాత్మ తన అనంత మేధస్సును ధారపోసి మనకు వరంగా
      ప్రసాదించిన జీవన ధనాన్ని మన దృష్టిలో పెద్దగా కనబడే చిన్న లక్ష్యాలను
      సాధించడానికి వృధాగా ధారపోయరాదు. దైవాన్ని ప్రేమించడం, దైవ నిర్మితమైన ఈ
      సృష్టిలోని ప్రతి అంశాన్నీ ప్రేమించడం, ప్రకృతితో తాదాత్మ్యం చెందడం మన మొదటి
      లక్ష్యం, చివరి లక్ష్యం. *
      *ఆడడం నెమలి లక్ష్యం. పాడడం కోయిల లక్ష్యం ఆడుతూ పాడుతూ బ్రతకడం మనందరి
      లక్ష్యం *
      --
      *ఓం నమో భగవతే వాసుదేవాయ *
      *సర్వం శ్రీ ఆంజనేయ స్వామి పాదారవిందార్పణమస్తు*
      *కె.బి. నారాయణ శర్మ - **నాకు తెలిసింది అల్పం తెలుసుకో వలసినది అనంతం.*
       

Collection of Vedic Mantras (Rare Mantras)

Collection of Vedic Mantras (Rare Mantras)

I've shared an item with you.




TELUGU KRISHNA BHAJANS

DOWNLOAD LINK:

MILLET FEST-2014_FROM 31JANto02FEB2014 AT NTR STADIUM HYDERABAD

MILLET FEST-2014_FROM 31JANto02FEB2014 AT NTR STADIUM HYDERABADMILLET FEST-2014_FROM 31JANto02FEB2014 AT NTR STADIUM HYDERABAD
చిరుధాన్యాల పండుగ - 2014

                       
                       
                       




KRODHAMUNU JAYINCHU PADHATI_SWAMI VIDYA PRAKASHANANDA GIRI

క్రోధమును జయించు పద్ధతి.- శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు.

 పూర్వకాలమున ఒకానొక సాయంసమయమున కృష్ణుడు, బలరాముడు, సాత్యకి ముగ్గురును కలిపి వాహ్యాళికై ఊరుబయటకు వెళ్లిరి. సుందరమైన ఉద్యానవనమును దాటి వారొక భీకరారణ్యమున ప్రవేశించిరి. వారు దానిలో కొంతదూరము పయనమగుటయే తడువుగా సూర్యాస్తమయము కాసాగెను. ప్రకాశము పూర్తిగా అంతరించి నలుదెసలు అంధకారము వ్యాపించెను. అపుడు వారు మువ్వురును గా...ఢారణ్యములో చిక్కుకొనిపోయిరి. ముందుకు పోవుటకుగాని, వెనుకకు వచ్చుటకుగాని అవకాశము లేకుండెను. అపుడు వారందరు ఆ అరణ్యములోనే ఒకానొకచొట ఆరాత్రియంతయు గడిపివేయుటకు నిశ్చయించుకొనిరి.

దట్టమగు అరణ్యమగుటచేతను, భయంకర మృగములు వసించుతావగుట చేతను రాత్రికాలమున ముగ్గురును పరుండి నిదురపోవుట భావ్యము కాదని తలంచి వారిలోవారు ఒక కట్టుబాటు చేసికొనిరి. ఒకొక్కరు కొద్దిసేపు మేలుకొనునట్లును, తక్కిన ఇద్దరు నిదురపోవునట్లును నిర్ణయించుకొనిరి. మేలుకొనుటలో మొట్టమొదటి వంతు సాత్యకికి వచ్చెను. అనగా సాత్యకి మేలుకొనుటయు, కృష్ణబలరాములు నిద్రపోవుటయు సంభవించెను. కృష్ణ బలరాములకు నిద్రాభంగము కలుగకుండు నిమిత్తమై సాత్యకి నలువైపులా తిరిగి పహారాకాచుచుండెను. క్రూరమృగములుగాని, మరి దేనినిగాని వారి దరిదాపునకే రాకుండ ఒడలంతయు కండ్లు చేసికొని బహుజాగరూకతతో అతడు నదుదెసల వీక్షించుచుండెను.

ఆ సమయమున దూరమునుండి ఒక భయంకరాకృతి గల రాక్షసుడు వారల సమీపమునకు వచ్చుచుండుటను గమనించి సాత్యకి వాని నెదుర్కొనెను. అపుడు ఇరువురికి భీషణ సంగ్రామము తటస్థించెను. రాక్షసునిపై సాత్యకికి ఎంతెంత క్రోధము జనించుచుండెనో రాక్షసుని శరీరము అంతంత వృద్ధియగుచుండెను. కొంతసేపటికి ఆ నిశాచరుడు పర్వతాకారుడు కాగా సాత్యకి వాని ధాటికి తట్టుకొనలేకపోయెను. పర్వతసముడగు రాక్షసునిచెంత సాత్యకి ఒక పురుగంత ఆకారము కలిగియున్నట్లాయెను. రాక్షసుడు సాత్యకిని లాగి ఆవలపారవైచి తనదారి తాను పోయెను. అత్తరి సాత్యకి శరీరమునకు చిన్న గాయము తగిలెను.

ఇట్లుండ సాత్యకి యొక్క పహారా సమయము పూర్తికాగా అతడు వెళ్లి బలరాముని లేపి రక్షణబాధ్యత అతనికి ఒప్పజెప్పి తానుపరుండెను. బలరాముని పర్వవేక్షణ సమయమునకూడా ఆ రాక్షసుడు తారసిల్లెను. వెంటనే బలరాముడు వానితో పోరునకు తలపడి అతనిని పరాజితుని చేయ సమకట్టెను. కాని ఎపుడెపుడు బలరాముడు రౌద్రభావమును వహించుచుండెనో, అపుడపుడు డారాక్షసుడు ద్విగిణీకృత బలశాలియై వృద్ధి నొందిన ఆకారము గలవాడై వర్తించుచుండెను. బలరాముడు రౌద్రమును వహించినకొలది రాక్షసుని ఆకారము పర్వతసమము కాజొచ్చెను. అంతట భీకరాకారుడగు ఆ దైత్యుడు బలరాముని ప్రక్కకు ఈడ్చివైచి తనదారిని తానుపోయెను. ఈ సంఘటనలో బలరాముని శరీరమునకు ఒకింత గాయము తగిలెను.

రాక్షసుడు వెడలిపోయిన పిదప బలరాముడు కృష్ణుని నిద్రలేపి "కృష్ణా! ఇక నీవంతు వచ్చినది. లేచి పహారా కాయుము" అనిపలికి తాను నిద్రపోయి రక్షణభాద్యత కృష్ణునకు ఒప్పగించెను. బలరామ సాత్యకులకు నిద్రాభంగము కలుగకుండుటకును, మరియు వన మృగముల బారినుండి వారిని సంరక్షించుటకును కృష్ణుడు దత్తచిత్తుడై బహుజాగరూకతతో పహారా కాచుచుండెను. మరల ఆరాక్షసుడు యథాప్రకారము ఏతెంచి ఉగ్రశరీరుడై కృష్ణునితో యుద్ధమునకు తలపడగా, కృష్ణుడు మందహాసవదనుడై అతని నెదుర్కొనెను. రాక్షసు డెంతెంత క్రోధమును వ్యక్తపరచుచుండెనో, కృష్ణుడు అంతంత శాంతమును వహించుచు హర్షాతిశయముతో కూడి పోరు సల్పుచుండెను. తత్ప్రభావముచే కొలది సమయములోనే రాక్షసుని శరీరము కృశించిపోయెను. అది చిన్నదై ఆవగింజంత అయ్యెను. అణురూపుడుగ మారిన ఆ రాక్షసుని కృష్ణుడు తన వస్త్రపు చెంగున ముడివైచుకొని బలరామసాత్యకులు పరున్న తావునకు వెడలెను. అప్పటికి ఉషఃకాలము సమీపించుచుండెను. ప్రభాత సమయము కాజొచ్చుటచే తక్కిన ఇరువురును నిద్రలేచిరి.

అత్తరి కృష్ణ, బలరామ, సాత్యకులు ఒకచోట కూర్చొని రాత్రి పహారాసమయములోని వారి వారి అనుభవములను గూర్చి సావకాశముగ మాట్లాడజొచ్చిరి.

సాత్యకి తను మేలుకొనియున్న సమయమున భీషణాకారుడగు రాక్షసుడొకడు వచ్చెననియు, వానిని జూచి కృద్ధుడై అతనితో యుద్ధమొనర్చుట కుపక్రమింపగా క్రమక్రమముగ అతని శరీరము వృద్ధి కాజొచ్చెనని వచించెను. బలరాముడున్ను అట్లే వచించెను. అపుడు కృష్ణుడు తన వస్త్రపు చెంగున ముడివేసియున్న అణురూపుడగు రాక్షసుని జూపి, ఓ అన్నగారూ! ఓ సాత్యకీ! మీరు ముద్ధముచేసిన రాక్షసుడితడే. ఇతడు మూర్తీభవించిన క్రోధము. అనగా క్రోధమను ఆసురగణము ఒక ఆకారమును ధరించి మనయెదుట ప్రత్యక్షమైనది. దానితో యుద్ధము చేయునపుడు మనము క్రోధమును వహించినచో అ రాక్షసునకు ఆహారము నొసంగినట్లగును. అపుడు వాని ఆకారము పెరిగిపోవును. మనము క్రోధమును వహించనిచో అతడు ఆహారములేక ఒక్కచిక్కి పోయి కృశించును. మీరు వానితో యుద్ధము చేయు సమయమున క్రోధావిష్టులై యున్నకారణమున క్రోధమును ఆహారముగ మీనుండి వానికి లభించుటచే అతని శరీరము బలపడిపోయెను. నేనో వానితో యుద్ధము చేయునపుడు నవ్వుచు, హర్షముతో గూడి యుండుట వలన, క్రోధమును జూపకపోవుట వలన క్రోధమను ఆహారము నానుండి అతనికి లభింపనిచే అతడు కృశించి కృశించి అతి సూక్ష్మశరీరుడై పోయెను. ఇదిగో చూడుడు! ఈతడే ఆ రాక్షసుడు.ఇతడు మూర్తీభవించిన క్రోధమను దుర్గుణము. ఆ సంగతిని తెలిసికొంటిని కాబట్టియే నేను బహుజాగరూకడనై క్రోధమును దరిదాపునకు రానీయకయుంటిని. తత్ఫలితముగ అతడు కృశించి అల్పశరీరుడైపోయెను. బలరామ సాత్యకులు జరిగిన సంఘటనను జూచి ఆశ్చర్యచకితులైరి. తదుపరి వారు మువ్వురును ఆ యరణ్యమును దాటి నిజపురంబున కరిగిరి.

ఈ సంఘటన ద్వారా క్రోధమును జయించుటకు చక్కటి ఉపాయమును శ్రీకృష్ణుడు లోకమునకు చాటిన వాడాయెను. ఎపుడెపుడు ఎదుటివాడు క్రోధమును ప్రకటించునో అపుడు తద్విరుద్ధముగ శాంత గుణమును మానవుడు కలిగియుండునో, ఆనందమును ప్రకటించునో, అక్రోధమును గలిగియుండునో అపుడు ఎదుటివాడు సిగ్గుపడి తన కోపమును తగ్గించుకొనగలడు. లేక, పూర్తిగా పోగొట్టుకొనగలడు. కాబట్టి కోపమునకు విరుద్ధమైన గుణములగు శాంతాదులను చక్కగ అవలంబించినచో కోపము పలాయనము చిత్తగించుటయేగాక, ఎదుటి వాడు తన తప్పు తాను తెలుసుకొని, సిగ్గుపడి దారికి వచ్చును. క్రోధము వచ్చినపుడు తద్విరుద్ధగుణమగు నవ్వుట నేర్చుకొనినచో, ఇక కోపము ఆవహించుటకు అవకాశమే యుండదు. ఒక్క క్రోధమునే కాదు సమస్తదుర్గుణములను గూడ ఈ యుపాయముచేతనే జయించుటకు వీలుండును. సాధకుడు ఇట్టి ఉపాయముల నవలంబించి తనయందలి అసురగుణంబు లన్నిటిని పారద్రోలి దైవసంపదతో తులతూగుచు జీవితమును పవిత్రవంతముగ ఆనందమయముగ నొనర్చు కొందురు గాక!

నీతి: కోపమునకు విరుగుడు శాంతము. కావున ఎల్లపుడు శాంతభావమును అలవాటుచేసికొనుము. క్రోధమును దరికి చేర్చరాదు. శాంతగుణముచే క్రోధగుణమును జయించవలెను.
 

MLA Madhavaram Krishna Rao Sensational Commets On Congress Govt. | KTR | Signal TV Telugu

🔴LIVE : టీజీపీఎస్సీ కానిస్టేబుల్స్ భార్యల కన్నీటి రోధన | Exclusive interview | News Line Telugu

VarthaluVastavalu#Revanth Govt Diversion Politics#O_Narsimhareddy#Anantaram#Suryapret

LIVE : KTR & BRS Leaders Visits Buchamma's family due to hydra demolitions Eha Telangana

Gundekattukundama DJ Version | Relare Prasad | BRS Party Latest Song 2024 #brsparty #ktr #kcr

అధికారమంత కొంతమందికే |Jai Nadigadda Yuvata Full Song |Renjarla Rajesh |Anjaneya Goud |Relare Prasad

Sunday, October 27, 2024

SANKIRTANACHARYAANNAMAYYA.K.J.YESUDAS&ASHABHOSELE&BALAMURALI

NAMASTHE TELANGANA&TELANGANA TODAY& TELANGANM 28 OCT 2024

Hanuman Chalisa...A Spritiual Prayer Of Lord Hanuman...

Hanuman Chalisa...A Spritiual Prayer Of Lord Hanuman...

 

Listen MS Rama Rao Telugu Hanuman Chalisa

video

- రచన -
M.S. Ramarao

శ్రీ హనుమను గురుదేవు చరణములు
ఇహపర సాధక చరణములు 
బుద్ధిహీనతను కలిగిన తనువులు 
బుద్బుధములని తెలుపు సత్యములు || శ్రీ|| 

Sree hanumaanu gurudevu charanamulu
ihapara saadaka charanamulu
bhuddhiheenatanu kaligina tanuvulu
bhudbhudamulani telupu sathyamulu ||sree||

హనుమాన్ చాలీసా
జయ హనుమంత జ్ఞానగునవందిత 
జయ పండిత త్రిలోక పూజిత 

రామ దూత అతులిత బలధామ 
అంజనిపుత్ర పవనసుతనామ 

ఉదయ భానుని మధుర ఫలమని 
భావన లీల అమృతమును గ్రోలిన 

కాంచనవర్ణ విరాజిత వేష 
కుండలమందిత కుంచితకేస  ||శ్రీ||

రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి 
రాజపదవి సుగ్రివున నిలిపి

జానకీపతి ముద్రిక దోడ్కొని 
జలధి  లంఘించి లంక జేరుకొని 

సూక్ష్మరూపమున సితను జూచి 
 వికతరూపమున లంకను గాల్చి 

భిమ రూపమున అసురలను జంపి 
రామ కార్యమును సఫలము జేసిన ||శ్రీ||

సిత జాడగని  వచ్చిన నిను గని 
శ్రీ రఘు వీరుడు కౌగిట నినుగొని  

సహస్ర రీతుల  నిను గొనియాడగ 
కాగల కార్యము నీపై నిడగ

వానరసేనతో వారధి దాటి 
లంకేసునితో తలబడి  పోరి 

హోరు హోరున పోరు సాగిన 
అసురసేనల వరుసను గూల్చిన ||శ్రీ||

లక్ష్మణ మూర్చ తో రాముడడగ 
సంజీవిని దేచ్చిన ప్రాణప్రదాత 

రామ లక్ష్మణుల అస్త్ర దాటికి 
అసురవీరులు అస్తమించిరి

తిరుగులేని రామభాణము 
జరిపించెను రావణ సంహారము 

ఎదురు లేని ఆ లంకాపురమున 
ఏలికగా విభీశునను జేసిన ||శ్రీ||

సీతారాములు నగవుల గనిరి 
ముల్లోకాల హారుతులందరి 

అంతులేని ఆనంద ఆశ్రువులే 
అయోద్యాపురి పొంగి పొరలే

సీతారాముల సుందర మందిరం
శ్రీ కాంతువదం నీ హృదయం

రామచరిత కర్ణామృత గాన 
రామనామ రసామృత పాన ||శ్రీ||

 దుర్గమమగు ఎ కార్యమైనా 
సుగామమే యగు నీకృప జాలిన

కలుగు సుఖములు నినుసరనన్న 
తొలగు భయములు నీ రక్షణ యున్న

రామద్వారపు కాపరివైన నీ 
కుత్తడి మీర  భ్రంహాదుల తరమా 

భూత పిశాచ సాఖినీ డాకినీ 
భయపడిపారు నీ నామజపము విని ||శ్రీ|

ధ్వజవిరాజ వజ్రశరీరా 
భుజబలతెజా గదాధరా 

ఈశ్వరాంశ శంభూత పవిత్రా 
కేసరి పుత్రా పావన గాత్ర 

సనకాదులు బ్రమ్హాది దేవతలు  
శారద నారద ఆదిశేషులు 

యమ కుభేర దిగ్పాలురు కవులు 
పులకితులైరి నీ కీర్తి గానముల ||శ్రీ||

"సోదర భారత నామానా " యని 
శ్రీ రాముడు ఎన్నిక గొన్న హనుమా 

 సాదుల పాలిట ఇంద్రుడవన్నా
అసురుల పాలిత కాలుడవన్నా

అష్ట సిద్ధి నవనిధులకు దాతగ
జానికీమాత దీవించెనుగ 

రామరసామ్రుత పానము జేసిన
మ్రుత్యుం జయువై  వెలసిన ||శ్రీ||

నీ నామ భంజన శ్రీ రామ రంజన 
జన్మ జన్మాంతర  దుఖభంజన

ఎచ్చటఉండిన రఘువరదాసు 
చివరకు రాముని చేరుట తెలుసు 

ఇతర చింతనలు మనసున మోతలు 
స్థిరముగా మారుతి సేవాలు సుఖములు 

 ఏందెందున  శ్రీ రామ కీర్తన 
అందందున హనుమాన నర్తన ||శ్రీ||

శ్రద్ధగ దీనిని ఆలకిమ్పుమా
శుభామఘు ఫలములు కలుగు సుమా 

భక్తి మీరి గానము చేయగ 
 ముఖ్తి కలుగు గౌరీసులు సాక్షిగా  

తులసీదాస హనుమాన చాలీసా 
తెలుగున సులువుగా నలుగురు పాడగా 

పలికిన సీతారాముని పలుకున 
దోశాములున్న మన్నిమ్పుమన్న ||శ్రీ||

మంగళ హారతి గొను హనుమంత 
 సీతారామ లక్ష్మణ సమేత |
నా అంతరాత్మ నిలుమో అనంత 
నీవే అంతా శ్రీ హనుమంతా ||

ఓం శాంతిహి  శాంతిహి శాంతిహి
శ్రీ రామర్పనమస్తు 


Sri Hanuman Bahuk – శ్రీ హనుమాన్ బాహుక్ Vedio and Complete Book

 

Sri Hanuman Bahuk – శ్రీ హనుమాన్ బాహుక్ Vedio and Complete Book

Sri Hanuman Bahuk – శ్రీ హనుమాన్ బాహుక్



------------------------------------------------------------------------------
హనుమంతుని త్రికరణశుధ్ధిగా సేవించువారి జన్మ ధన్యమనుటకొక చక్కని ఉదాహరణ 
తులసీదాస్ జీవితం. పుట్టుకతోనే తల్లిని కోల్పోయిన వానిని మూలానక్షత్ర జాతకుడు, 
నష్టజాతకుడని, కుటుంబానికి అరిష్టమని తండ్రి వదిలేశాడు. చేరదీసిన దాదికూడా 
చిన్నతనంలోనే చనిపోవటంతో అతణ్ణి దగ్గరకు తీయటానికే అందరూ వెరచేవారు. 
దిక్కులేనివారికి దేవుడే దిక్కన్నట్లు భగవదనుగ్రహంతో పెరిగాడు.
ఏ విధమైన కష్టములనున్న వారయినా దీనిని పఠించి హనుమదనుగ్రహమునకు 
పాత్రులై పీడావిమోచనము పొందవచ్చును. హనుమత్సాహిత్య ప్రచారముచేయు 
మా శ్రీ హనుమదాధ్యాత్మిక కేంద్రం ఆశయము ననుసరించి దీనిని భకకోటి 
కందజేయ గల్గుచున్నందుకు సంతసించుచున్నాము. ఈ గ్రంధము 
నాదరించి మా కృషిని ప్రోత్సహించవలసినదిగా కోరుచున్నాము. 
తులసీదాసకృతమగు నీస్తోత్రమును సద్వినియోగ మొనర్చుటద్వారా ఎల్లవారు 
హనుమత్కృపకు పాత్రులౌదురుగాక!
------------------------------------------------------------------------------
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/EWCkUAY-0OU?si=CmRJJiOh6lkmIlwC" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/gujH1r4nS6M?si=_Ti-_RznWcDIIjM_" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

MARANAM LENI MEERU #PDF BOOK FREE DOWNLOAD

 MARANAM LENI MEERU



 
 MARANAM LENI MEERU.pdf

Download link: 

YOGA BOOKS FULL COLLECTION FREE DOWNLOADLINK



















YOGA BOOKS FULL COLLECTION 
FREE DOWNLOADLINK 

ఎమర్జన్సీని మించిన దాడులు ప్రభుత్వంపై లాయర్ సోమ భరత్ ఫైర్ -Soma Bharath News Line Telugu

TELANGANA VIDEOS TODAY LATEST

SWARANJALI MUSIC GROUP PHOTO GALLERY

  SWARANJALI MUSIC GROUP PHOTO GALLERY SWARANJAL...