Sunday, January 26, 2025

నిను గని పూజించు జనులు ఘనులు నిజముగ భువిలో వారే ధన్యులు


నీ చరిత పాడుకోనా
(చైతన్య గానం - 3)
20. నిను గని పూజించు జనులు
పల్లవి :
నిను గని పూజించు జనులు ఘనులు
నిజముగ భువిలో వారే ధన్యులు ॥ నిను ॥
చరణములు:
1. నీ విభవము గని పులకరించిన
ఆకాశమె అనంత మాయె
తీపి తలపులతో తూగిన లతలు
పూజా వేళకు పువ్వులు తొడిగె
2. దీపారాధన అర్కుని పుణ్యము
మాల సమర్పణ హరివిల్లు భాగ్యము
నిండు మనసుతో పండు జాబిలి
హారతు లిచ్చి నిను అర్చించే
3. పొంగే తరంగాల అంగాలు చాచి
నీ అడుగులు పడినది గంగమ్మ తల్లి
కులుకుల పైటను మెల్లగ పరచి
తన ఒడిలో దాచెను యమునాదేవి ॥నిను ॥
4. మ్రోగుచున్నవి గుడిలో గంటలు
మోయుచున్నవి గుట్టుగ గాలులు
తడుపు చున్నవి చల్లని వానలు
తన్మయ మైనవి చైతన్య తలపులు ॥ నీను ॥

**********************************************



No comments:

Post a Comment

ANNAMACHARYA KIRTANALU G BAKLAKRISHNA PRASAD@DAILY MOTION VIDEOS

​ SRI VENKATARAMANA GOVINDA_G.BALAKRISHNAPRASAD https://dai.ly/x64etea ...