ఎవరు? నాయనా! నీవు .....
ఎందుకింత ఆవేదన పడుతున్నావు?
జీవిత పరమార్థం తెలుసుకోలేక ఆర్తి పడుతున్న అంధుణ్ణి,
జీవితానికి పరమార్థమంటూ ఒకటుందనుకుంటున్నావా?
లేదా స్వామీ?
వేద వేదాంగాలను ఎరిగిన మహర్షులు,
దేశ దేశాలు జయించిన చక్రవర్తులు
సీదా సాదా అంతా
పుట్టి పెరిగి మరణిస్తున్నారే!
వీరంతా మరణించిన తరువాత ఏమౌతున్నారు స్వామి?
పిచ్చివాడా!
లోకమంతా ఈ శరీరంతో జీవించి సుఖించాలని తాపత్రయ పడుతుంటే
మరణించిన తరువాత ఎమౌతారనే విచారం నీకెందుకు?
ఆ విచారం వదలుకో !
నీకు అప్లైశ్వర్యాలు కలిగే మార్గం చూపిస్తాను అనుభవించు
వద్దు స్వామీ! అవన్నీ అనుభవించి క్షణికములని, క్షుద్రములని తెలుసుకున్నాను.
వాటిపై నాకు వాంఛ లేదు.
నన్ను బాధిస్తున్న ప్రశ్న ఒక్కటే!
మనం ఎక్కడి నుంచి పుడుతున్నాం? ఎక్కడికి పోతున్నాం?
ఈ సందేహం నివారించండి!
ఈ రహస్యం తెలుసుకోవటానికి దేవతలకే సాధ్యం కాలేదే,
మానవులకు సాధ్యం అవుతుందా?
మీవంటి మహానుభావులే సాధ్యం కాదంటే మాకు దిక్కెవరు? స్వామీ!
మేమీ దుఃఖ భాజనమైన సంసారం లో కృశించి జనన మరణ ప్రవాహంలో కొట్టుకు పోవలసిందేనా?
మానవునికి తరుణోపాయం లేదా స్వామీ?
లేకేం నాయనా ఉంది ...
ఈ శరీరం విద్యావిద్యలు రెంటితోనూ పుట్టింది.
సంసార యాత్రకు మోక్ష యాత్రకు ఇదే సాధనం
అవిద్యచే మొహితుడవై కనిపించే ఈ జగత్తు సత్యము నిత్యము అనుకొని,
దుఃఖ భాజనములమై చావు పుట్టుకుల కుమ్మరిసారిలో తిరుగుచున్నాము.
ఇదంతా అనిత్యమని,
ఈ నాటకానికంతా కారణమైన మహా చైతన్యం వేరే ఉందని,
అది నిత్యము సత్యమని తెలుసుకొని ఆ ఆత్మను భావము పొందాలి అదే జీవిత పరమార్థం..
ఆ ఆత్మానుభవం నాకెట్లా కలుగుతుంది స్వామీ?
భక్తి మార్గం తో కొందరు జ్ఞానమార్గం తో కొందరు సాధించారు,
కాని, జీవన్ముక్తి కి రాజయోగమే సులభోపాయమని పెద్దల మతం.
రాజ యోగమా?!
నాకెవ్వరు ఉపదేశిస్తారు స్వామీ?
ఆ సమయం వచ్చినప్పుడు పరమాత్మే సద్గురువై వచ్చి ఉపదేశిస్తాడు.
కారు చీకటిలో దారి తెలియక తికమక పడుతున్న నాకు,
వెలుగు వలె మీరు లభించారు. మీరే నా గురువులు నా దైవం.
ఆ యోగ రహస్యం నాకు బోధించి, సత్య స్వరూపం చూపించండి.
అతి గుప్తమైన ఆత్మ విద్యను నీకు బోధిస్తున్నాను. సావధానుడవై వినుము.
రసాన్ని కట్టేస్తేనే కాని స్వర్ణం కానట్టు, మనస్సుని కట్టివేస్తే కాని సత్యము కనిపించదు.
మనస్సే మన బంధానికి మోక్షానికి కారణం.
మనస్సుని స్వాధీనం చేసుకుంటే, మనకు స్వాధీనం కానిదే లేదు.
ఆ సాధనే యోగామంటారు.
సాంగయోగాన్ని క్రమంగా సాధించి, చిత్త వృత్తులనణచి,
సమాధి స్థిరుడవైనప్పుడు,
నీ మనస్సుకు అనంత శక్తి కలుగుతుంది,
అప్పుడు నీవు చేయలేని కార్యమే ఉండదు,
నిన్నింత వరకు తన చేత చిక్కిన్చుకుని ఆడించే ప్రకృతి,
నీ స్వాధీనం అవుతుంది.
'మోక్షం' అంటే అదేనా! స్వామీ?
కాదు నాయన ! అది మోక్షానికి మొదటి మెట్టు.
ఆ అనంత శక్తి ప్రలోభానికి మోసపోక,
సుస్థిర చిత్తుడవై ధ్యానిస్తే,
స్వయం ప్రకాశము, సచ్చిదానంద మయము, శాశ్వతము అయిన స్వస్వరూపానుభావం
కేవల జ్ఞాన రూపంగా నీవనుభవిస్తావు..
''అంటే అదే!
అప్పుడు నువ్వు నేను ఒక్కటే!
రాజ యోగ సాధన చేసి అఖండ బ్రహ్మానందానుభవం పొందు !
గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర:
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ||
Sunday, April 13, 2025
జీవిత పరమార్థం #PURPOSE OF LIFE
Subscribe to:
Post Comments (Atom)
ANNAMACHARYA KIRTANALU_G.BALAKRISHNA PRASAD VIDEO LINKS@DAILYMOTION CHANNEL
ANNAMACHARY KIRTANALU_G.BALAKRISHNA PRASAD_DISK-8 https://dai.ly/x64szk2 ANNAMACHARYA KIRTANALU_G.BALAKRISHNA PRASAD_DISK-4 https://dai.l...

-
SHIVA AARADHANA {TELUGU} shared by "hindudevotional2" https://www.mediafire.com/?x98116wyv26tw SHIVA AARADHANA {TELUGU} https:...
No comments:
Post a Comment